మేధావులారా.. ఉపాధ్యాయులారా
ఆలోచించండి..ఆదరించండి..
ఎమ్మెల్సీ ఓటర్లకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు ,మంథని అసెంబ్లీ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపు.
మంథని :- నేటి ధాత్రి
మంథని నియోజకవర్గంలో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య లకు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి మంథని పట్టణం లో సునీల్ రెడ్డి ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులకు మీ ప్రాధ్యాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాడు.నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీనీ గెలిపించాలి చట్టసభల్లో మీ తరపున ప్రశ్నించే గొంతులు ఉండాలంటే బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థులు గెలవాల్సిందే మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఈ గెలుపు చాలా కీలకం మేదావులంతా తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను వల్ల భవిష్యత్ కోసం బీజేపీ నీ గెలిపించండి అంటూ 317 జీవో కి వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేసింది నీరుద్యోగ సమస్యలపై బిజెపి చేసినా పోరాటాలను ఓటర్లు గమనించాలని అన్నారు
ఆదిశగా మేధవులంతా.. ఆలోచిస్తారని.. పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు తధ్యం ఓటర్లుఅంతా మీ మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య లకు వేసి మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి ,బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మంథని అసెంబ్లీ ఎంఎల్సీ ఎన్నికల ప్రభారీ నీలకంఠం పాండు ,ఎంఎల్సీ అసెంబ్లీ కన్వీనర్ బిరుదు గట్టయ్య ,అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్ ,మంథని పట్టణ ,మండల అధ్యక్షులు సంతోష్ ,రాజేందర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్ ,మంథని మాజీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ ,కామన్పూర్ మండల ఇంచార్జి చిలువేరి సతీష్ సీనియర్ నాయకులు సామల అశోక్ ,నరమళ్ల కృష్ణ,లక్ష్మణ్, ఎడ్ల సాగర్ ,శ్రవణ్ ,సత్యం,అయింటి మల్లేష్ ,మహేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.