*ఆర్ హెచ్ వి ఎస్ జిల్లా అధ్యక్షులుగా సుందర కుమార్..

President.

*ఆర్ హెచ్ వి ఎస్ జిల్లా అధ్యక్షులుగా సుందర కుమార్..

*మే 14 నుంచి 26 వరకు బద్రీనాథ్ లో సరస్వతీ పుష్కరాలు…

*త్వరలో ఆర్ హెచ్ వి ఎస్ ప్రాంతీయ కార్యాలయం తిరుపతిలో ప్రారంభం…

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 17:

 

రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ( ఆర్ హెచ్ వి ఎస్ ) జిల్లా అధ్యక్షులుగా కీర్తిపాటి సుందర్ కుమార్ ను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు తెలిపారు. గురువారం స్థానిక మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య సంరక్షకులు మహంతు వైదేహి వల్లభ శరన్ దాస్ మహారాజ్, జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా), జాతీయ ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్ల లచే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హిందూ సామ్రాజ్యం లో రామ రాజ్య స్థాపన కోసం, సనాతన హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను ఈ ఏడాదిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా రామ రాజ్య స్థాపనే ఎజెండాగా ఏర్పాటైన ఆర్ హెచ్ వి ఎస్ వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు. ఈ నెలలో ఆర్ హెచ్ వి ఎస్ ప్రాంతీయ కార్యాలయాన్ని తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్ర ప్రారంభమై అయోధ్య వరకు కొనసాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూపీ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ లతోపాటు శ్రీలంక, మారిషస్ ప్రధానులు, నేపాల్ కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అనిత దేవి సాహూ,తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి,
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉపసభాపతి రఘురామకృష్ణమ రాజు ( ఆర్ ఆర్ ఆర్) ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు సుందర కుమార్ మాట్లాడుతూ హైందవ ధర్మం కోసం, ఆధ్యాత్మిక చింతన కోసం, శ్రీరామ రాజ్య స్థాపన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహా యజ్ఞంలో తమకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తూ తమ వంతు శక్తివంచన లేకుండా ఆర్ హెచ్ వి ఎస్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ హెచ్ వి ఎస్ ఆధ్వర్యంలో సీతా సమేత శ్రీరామ సేవకులను అతి త్వరలో నియమించనున్నట్లు గిరి రాజు తెలిపారు. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ రథయాత్ర విజయవంతా నికి ఇప్పటినుంచి ప్రణాళికాబద్దం గా వ్యవహరించి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారుతమకు ఈ బాధ్యత అప్పగించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా),నవీన్ చంద్ర శుక్ల,దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్,రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు,ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు, టీటీడీ కాంట్రాక్టర్ గిరిరాజు లకు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!