Sun Valley High School Achieves Second International Recognition
సన్ వాలి హై స్కూల్ అంతర్జాతీయ గుర్తింపు
కరస్పాండెంట్ వేముల శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
భారతదేశం తరఫున సన్ వాలి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరస్పాండెంట్ వేముల శంకర్ హాజరైనారు అనంతరం స్వయంగా విద్యార్థులకు రూ. 1001/- నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు వ షీల్డ్లు అందజేశారు. ఈ సందర్భంగా వేముల కరస్పాండెంట్ శంకర్ మాట్లాడుతూ
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సన్ వాలి హై స్కూల్ కు రెండవ అంతర్జాతీయ గౌరవ అవార్డు రావడం చాలా సంతోషం గతంలో ఈ పాఠశాల ఆస్ట్రియా దేశం నుండి ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందింది. ఇప్పుడు మరోసారి విద్యార్థుల ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు రావడం పాఠశాల ప్రతిష్టను మరింతగా పెంచింది.అని వారు అన్నారు మా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడం పాఠశాల విద్యా ప్రమాణాలకు ప్రతీక.
ఈ విజయం పాఠశాల ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, మరియు తల్లిదండ్రుల సహకారం ఫలితంగా సాధ్యమైంది,
సన్ వాలి హై స్కూల్ ఎల్లప్పుడూ విద్యలో నాణ్యత, క్రమశిక్షణ విలువలతో ముందంజలో ఉంటుంది అని అన్నారు.
ఈ అంతర్జాతీయ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
