వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి :
క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో గొర్రెకుంట పాఠశాలలో వాలీబాల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారబం అయ్యింది.ఈ సందర్భంగా క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు సమకూర్చిన క్రీడా సామాగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నళిమెల జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వేసవి సెలవులలో క్రీడా శిక్షణా శిబిరంలో పాల్గొని క్రీడా సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ శిబిరం మే 30 వరకు కొనసాగుతుందని,క్రీడల్లో మంచి ఫలితాలు సాధించిన వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పాఠశాల పిఇటి,కోచ్ జె.రఘువీర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గొర్రెకుంట పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.