కోరగుట్ట ఎన్ కౌంటర్ లో అసువులు బాసిన సుధాకర్ దంపతులు..!

ముగిసిన 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం.

ఇప్పటివరకు ఉద్యమంలో అసువులు బాసిన ఆరుగురు చల్లగరిగ వాసులే.

మృతదేహాల కోసం బయలుదేరిన బంధువులు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ శంకరన్న చత్తీస్ గడ్ రాష్ట్రంలోని కాంకేర జిల్లాలోని బేనగొండ కోరగుట్ట అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలిసింది ఈ ఎన్కౌంటర్లో సుధాకర్ భార్య రజిత కూడా మృతి చెందినట్లు తెలిసింది, సుధాకర్ 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది, 15 ఏళ్ల వయసులోనే అప్పటి పీపుల్స్ వార్ పార్టీ పట్ల ఆకర్షితుడై అజ్ఞాతవైపు అడుగులు వేసిన సుధాకర్ అంచలంచలుగా ఎదిగి మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరిగాడు, ఇదే ఎన్కౌంటర్లు భార్య సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు సమాచారం,కోరగుట్ట అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మృతి చెందారని ముగ్గురు భద్రత సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే, ఈ ఎన్కౌంటర్లో సుధాకర్ అలియాస్ శంకరన్న దంపతులు మృతి చెందారని తెలియడంతో చల్లగరిగే గ్రామం కన్నీటి సంద్రంగా మారింది, ఎవరిని కదిలించిన కన్నీళ్లు పర్యంతమవుతున్నారు, సుధాకర్ అలియాస్ శంకర్ ఎన్కౌంటర్లో మృతి చెందాడన్న విషయాన్ని పోలీసులు మాత్రం ధ్రువికరించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తీవ్ర ఆందోళన గురయ్యారు, చివరికి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తెలుసుకొని మృతదేహాల కోసం బంధువులు వెళ్లినట్లు సమాచారం.

సుధాకర్ ఉద్యమ ప్రస్థానం..

చిట్యాల మండలంలోని చల్లగారి గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ ఆలియాస్ మురళి అలియాస్ శంకర్ ఉద్యమ ప్రస్థానం ముగిసినట్లే అయింది, సుధాకర్ చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు, 1998లోనే ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే పీపుల్స్ వార్ పార్టీ పట్ల ఆకర్షితుడై ఉద్యమ ఓనమాలు నేర్చుకున్నాడు, అప్పటి ఉద్యమ సిద్ధాంతాలకు ఆకర్షితులై సానుభూతిపరుడుగా పని చేశాడు తన చిన్నమ్మ కుమారుడు కలికోట శంకర్ భూపాలపల్లి శివారు బొగ్గుల వాగు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా ఆ తరుణంలోనే మరింత చురుగ్గా పాల్గొన్న సుధాకర్ 1999లో 9వ తరగతి చదువుతూనే అజ్ఞాతంలోకి వెళ్ళాడు అప్పటినుండి సుధాకర్ స్వగ్రామానికి తిరిగి రాలేదు. 9వ తరగతిలో 15 ఏళ్ల వయసులో ప్రయాణమైన సుధాకర్ అజ్ఞాత జీవితం నేటికీ సుమారు 25 ఏళ్లు ఉద్యమంలో అనేక పోరాటాలు చేస్తూ ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తూ వివిధ హోదాల్లో పని చేశాడు. సుధాకర్ ముందుగా నిజాంబాద్ జిల్లా బాన్సువాడ ఏరియా జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశాడు అనంతరం పరిస్థితిలో ప్రభావం కారణంగా చత్తీస్గడ్ రాష్ట్రంలోని ఉత్తర బస్తర్ ఏరియా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు సమాచారం,

సుధాకర్ కుటుంబ నేపథ్యం..

చిట్యాల మండలంలో ని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి ఓదెలు రాజ పోచమ్మ దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కూతుళ్లు సంతానం కాగా సుధాకర్ తండ్రి ఓదెలు 15 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు చిన్న కూతురు దేవేంద్ర కుటుంబ సభ్యులతో పదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది, పెద్ద కూతురు విజయ భూపాలపల్లి మండలం గుడాడుపల్లిలో తన కుటుంబంతో నివాస ఉంటుంది. సుధాకర్ తల్లి రాజకపోచమ్మ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేది వృద్ధాప్యం మీద పడడంతో కూలిపానికి వెళ్లలేక ఇంటి వద్ద ఉంటుంది ఈ క్రమంలోనే సుధాకర్ ఎన్కౌంటర్లో మృతి చెందాడని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.

సుధాకర్ మృతదేహం గుర్తింపు కోసం బయలుదేరిన బంధువులు….!

ఎన్కౌంటర్లో మృతి చెందిన సిరిపెల్లి సుధాకర్ ఆలియాస్ మురళి అలియాస్ శంకరన్న మృతి చెందాడు అన్న సమాచారంతో బంధువులు గుర్తించడానికి బయలుదేరినట్లు సమాచారం అలాగే సుధాకర్ దంపతుల మృతదేహాలను గుర్తించి చల్లగరిగకు శుక్రవారం రోజున తీసుకొని వస్తున్నట్లు స్థానికుల సమాచారం,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *