పాలకుర్తి నేటిధాత్రి
శనివారం నుండి మొదలు కానున్న బతుకమ్మ పండుగను, సెలవుల రీత్యా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, బతుకమ్మ గొప్పతనాన్ని వివరిస్తూ మహిళా సేవా భారతి, సుధా టెక్నో స్కూల్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్కూల్ డైరెక్టర్ రాపాక విజయ్, క్లబ్ అధ్యక్షులు చెన్నూరి అంజలి, ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగను శతవాహనుల కాలం నుండే మన ప్రాంతంలో జరుపుకుంటున్నట్లు, ప్రపంచం లోనే ఎక్కడ జరుపుకొని విధంగా, పూలను పూజించే పండుగ అని, బతుకమ్మ తల్లి అందరి ఆడబిడ్డలకి మంచి బతుకునివ్వాలని, తొమ్మిది రోజులు జరుపుకుంటారని, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ తో మొదలయి చివరికి సద్దుల బతుకమ్మ తో ముగుస్తుందని, తదుపరి దసరా కూడ చాలా ఘనంగా జరుపుకోవాలని తెలియ చేస్తూ, సెలవులని విద్యార్థులు సధ్వినియోగపరుచుకొని పండుగ గొప్పతనాన్ని, మన సంస్కృతి ని కాపాడుకోవాలని తెలియ చేసి, ఘనంగా పెద్ద బతుకమ్మ పేర్చి చూపించి, సుమారు ముప్పయి ఆయదు బతుకమ్మలని పిల్లలచే తయారు చేపించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు నీలిమ, విమల దేవి, వాసవి, పూర్వ పాలకుర్తి క్లబ్ అధ్యక్షులు చెన్నూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.