
Ghatikachalam
సడన్‌గా ఓటీటీకి.. లేటెస్ట్ ఇంటెన్స్ హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్
ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఓ హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం పక్షం రోజులకే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి షాకిచ్చింది
నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) హీరోగా వాస్తవ ‘హర్రర్’ ఘటనలతో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఘటికాచలం’ (Ghatikachalam).
అమర్ కామెపల్లి (Amar Kamepalli) దర్శకత్వం వహించగా ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటించారు.
ఎం.సి రాజు నిర్మాత.
మే31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నపట్పటికీ ప్రచార లోపం వళ్ల జనాలకు చేరలేక పోయింది.
బేబీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించిన ఎస్ కేఎన్ మారుతితో కలిసి
ఈ సినిమాను రిలీజ్ చేయడం విశేషం.
అయితే ఇప్పుడీ చిత్రం పక్షం రోజులకే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి షాకిచ్చింది.
కథ విషయానికి వస్తే..
నిర్మాత రాజు నిజ జీవితంలో జరిగిన ఘటనల అధారంగా రెడీ చేసుకున్నకథతో సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన
ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఓ ఢిపరెంట్ చిత్రం చూస్తున్నామనే ఫీల్ ఇస్తుంది.
అక్కడక్కడ లాగ్ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు పిల్లలతో సరిగ్గా లేకపోతే ఎలాంటి ఘటనలు జరుగుతాయనే అంశంతో మంచి సోషల్ మెసేజ్ అందించారు.
హర్రర్, సైకలాజికల్ సినినమాలను ఇష్టపడేవారు ఒకసారి ఈ మూవీని చూడవచ్చు.
ఇప్పుడీ ఘటికాచలం’ (Ghatikachalam).
సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.