“ప్రజా సంక్షేమమే”కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యం…
కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది…
పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి…
మేడిపల్లి(నేటీదాత్రీ):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ప్రజాపాలన కార్యక్రమం చివరి రోజు వివిధ డివిజన్లలో సందర్శించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుందని, అభయ హస్తం ఆరు గారంటీ పథకాలైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, యువ వికాసం, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, 100 రోజుల లోపు అమలు చేసి తీరుతుందని అన్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లలో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారని, త్వరలో అర్హులందరికీ పథకాలు అమలవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎనిమిది రోజులపాటు విజయవంతంగా నిర్వహించిన మున్సిపల్ అధికారులకు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.