
తెలంగాణ ఆటో డ్రైవర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు: ఈసంపెళ్లి సంజీవ
వరంగల్, నేటిధాత్రి:
ఈరోజు వరంగల్ చౌరస్త లో మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ నిరసన తెలుపడం జరిగినది వరంగల్ ఉమ్మడి జిల్లలో మరియు త్రినగరంలో 16 న ఆటోలు బందు విజయవంతంగా జరిగినది.ఈ బందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పెట్టడం జరిగినది కానీ దనివల్ల ఆటో డ్రైవర్ల కు ఆటో కిరాయిలు కాక అనేక మంది ఆటో డ్రైవర్స్ కుటుంబాలు పోసించుకొలేక ఇబ్బందులు పడుతున్నారు అందుకుగాను ఈనెల 16న ఆటో లు బందు పిలుపునివ్వడం జరిగినది. ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ఉంటారు మన ఉమ్మడి జిల్లా లో 56వేల మంది మన త్రినగారం లో 18వేల మంది ఉంటారు కాబట్టి మాకు ప్రభుత్వం ఒకరికి నెలకు 15000 వెలు జీవనభృతి ఎవ్వలని ప్రభుత్వాన్నీ కోరుచున్నాము ఈ కారిక్రమంలో మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈసంపేల్లి సంజీవ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మడికొండ బాబు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు కలకొట్ల జయరాం, పసునూరి బాబు బొల్లం సంజీవ అమీర్ ఈశ్వర్, రవీందర్ యాకూబ్ పాషా 50 మంది పాల్గొన్నారు.