ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 33 జిల్లాల సమావేశం
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య దిశా నిర్దేశం
ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొఫెసర్ డాక్టర్ బి. విజయలక్ష్మి, ప్రొఫెసర్ చెన్నప్ప.
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎం వి హాల్ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య అధ్యక్షతన 33 జిల్లా కమిటీల పరిచయ సమావేశం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ‘లా’ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ బి విజయలక్ష్మి, కామర్స్ డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ డి.చెన్నప్ప, రిటైర్డ్ ఏఎస్పి వి సదానందరెడ్డి, తెలంగాణ హైకోర్టు ఏజీపీలు ఎం గౌతమ్ కుమార్, వంశీకృష్ణ, జాతీయ మానవ హక్కుల కమిటీ నేషనల్ వైస్ చైర్మన్ న్యాయవాది కదిరి రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ డాక్టర్ బి విజయలక్ష్మి మాట్లాడుతూ మానవ హక్కులు ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు సమాజంలో తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకొని చట్టాలపై అవగాహన కలిగి ఉంటే ఈ దేశాన్ని ఒక గొప్ప సమాజంగా నిర్మించుకోవచ్చని అన్నారు. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ నిర్మాణ ప్రక్రియను అభినందించారు. నేషనల్ ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ కార్యవర్గానికి జిల్లా కమిటీల కార్యవర్గాలకు దిశా నిర్దేశం చేస్తూ ఒక బలమైన లీగల్ ప్రొసీజర్ తో ప్రోటోకాల్ సిస్టంతో పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం తమ సంస్థ ఏర్పడిందని అన్నారు. 12 రాష్ట్ర కమిటీలతో పాటు తెలంగాణలో దాదాపు అన్ని జిల్లా కమిటీలను పూర్తి చేసామని అన్నారు. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం ఒక బలమైన వేదికను నిర్మించి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేందుకు జాతీయ మానవ హక్కుల కమిటీ పని చేస్తుందని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రభుత్వాల అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందే విధంగా తమ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ను మానవ హక్కుల కమిషనర్లను వెంటనే నియమించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ నాయకులు ఆర్కే ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మీదింటి శివవీర్, రాష్ట్ర కార్యదర్శులు తోట రాజయ్య, గూడూరు మాంచాలక్క, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు శ్రీరాముల రమేష్, సయ్యద్ కలీం, ప్రచార కార్యదర్శి బేతు శ్రీనివాస్ అధికార ప్రతినిధి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఈసీ సభ్యులు దయ్యాల సదయ్య, రామిండ్ల తిరుపతి, ఎండి సమి, రమేష్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, భాస్కర్ రావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు భరత్ రాజ్, గ్రేటర్ వరంగల్ అధ్యక్షురాలు బాలినే లక్ష్మి , 33 జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు, జిల్లా కమిటీల సభ్యులతో పాటు న్యాయవాదులు, పాత్రికేయులు,సామాజిక ఉద్యమకారులు పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ సభ ద్వారా డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆధ్వర్యంలోని ఎన్ హెచ్ ఆర్ సి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన నిలబడే ఒక బలమైన వేదిక నిర్మితమైందని మేధావి వర్గం భావిస్తోంది.