విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం
౼అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్థులు
నిజాంపేట్, నేటి ధాత్రి
ప్రెస్ క్లబ్ నిజాంపేట ( రి.నెం 738/25 ) ఆధ్వర్యంలోశుక్రవారం నిజాంపేట మండలకేంద్రంలో ఆర్ వి ఎమ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరం లో కంటి పరీక్షలు, జనరల్ మెడిసిన్,జనరల్ సర్జరీ,ఈఎన్ టి,ఆర్థో పెడిక్ డాక్టర్ లు రోగులను పరీక్షించి..ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు.ఈ ఆరోగ్య శిబిరానికి మండల తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎస్సై రాజేష్,ముఖ్య అతిథిగా హాజరై వైద్య పరీక్షలు చేయుంచుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు.ప్రెస్ క్లబ్ సభ్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు తంబలి రమేష్,వ్యవసాయ అధికారి సోమలింగ రెడ్డి, ఏ ఈ ఓ శ్రీలత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మాట బాబు, బిజెపి పార్టీ నాయకులు నరేందర్,, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బండారి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి సంజీవ్,కార్యదర్శి స్వామి, కోశాధికారి ప్రదీప్ రెడ్డి, గట్టు ప్రశాంత్, జల పోశయ్య, శ్రీనివాస్,ఆర్ వి ఎమ్ డాక్టర్ లు, గీతాంజలి, తేజస్విని, గ్రీష్మ, సిక, భూమిక,మార్కెటింగ్ మేనేజర్ లక్షణ్
పీఆర్ ఓ లు సంతోష్,కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.