
Agricultural Mechanization Sub-Plan
సబ్సిడీ పై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు*
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
2025-26 ఆర్థిక సంవత్సరనికిగాను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్ కే బి వై లో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ ఉప ప్రణాళిక (ఎస్ ఎం ఎ ఎం) ద్వారా సబ్సిడీ పై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు కొరకు ఆసక్తి గల రైతులు ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
భూపాలపల్లి డివిజన్ పరిధిలోని మొగుళ్ళపల్లి మండలానికి కేటాయించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మేకనైజేషన్) క్రింద వ్యవసాయ యంత్ర పరికరాలకై ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 కు గాను సన్న కారు, చిన్న కారు రైతులు మహిళ రైతులకు, ఎస్సి, ఎస్టి రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. ఇట్టి రైతుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఈ పథకం క్రింద మొగుళ్ళపల్లి మండలానికి బ్యాటరీ స్ప్రేయర్స్ -85, పవర్ స్ప్రేయర్స్- 27, రోటవేటర్స్-6, కల్టివేటర్స్/MB ప్లౌ -7, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్-1, బ్రష్ కట్టర్-1, పవర్ టిల్లర్-1, పవర్ వీడర్ –1 మరియు స్ట్రా బేలర్-2 కేటాయించడం జరిగింది. ఇట్టి పథకానికి ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టి & జనరల్ మహిళా రైతులు దరఖాస్తు తో పాటుగా, పట్టాదార్ పాస్ పుస్తకం కాపీ, ఆధార్ కార్డు కాపీ, కుల ధ్రువీకరణ పత్రం, ట్రాక్టర్ కు సంబంధించిన పరికరాలకై రిజిస్ట్రేషన్ పేపర్స్ తో ఫోటో అతికించిన దరఖాస్తును మీ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు రైతు వేదికలో గాని మొగుళ్ళపల్లి మండల వ్యవసాయ కార్యాలయంలో గాని అందజేయవలసిందిగా అర్హులైన రైతులను కోరుతున్నాం. అలాగే వివిధ పనిముట్లకు అనుమతించబడే సబ్సిడీ గురించి దరఖాస్తులు మరియు ఇతర పూర్తి సమాచారాన్ని పొందుటకొరకు మీ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి ఏ ఈ ఓ/మండల వ్యవసాయ అధికారి (ఎం ఏ ఓ) సంప్రదించగలరు.