సభ్యత్వం ఇవ్వండి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమం చేయండి.

నడికూడ,నేటిధాత్రి:

పి ఆర్ టి యు టి ఎస్ నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పిఆర్టియు ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు సాధించి ఉపాధ్యాయులకు జెయల్, ఎంఈఓ,డిప్యూటీవోలుగా, ఏడీలుగా అందరూ ఉపాధ్యాయులు సమానంగా పదోన్నతులు పొందడానికి అవకాశం కలిగే విధంగా కృషి చేస్తామని,పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఏ లలో మూడు డీఏలను ఇప్పిచ్చే విధంగా కృషి చేస్తామని, పిఆర్సి ఫిట్నెంటు 35% పెంచే విధంగా,నగదు రహిత హెల్త్ కార్డులను ఇప్పించి అన్ని కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందే విధంగా, ప్రభుత్వం ఇంతకుముందే ఒప్పుకున్న విధంగా 5550 పిఎస్ హెచ్ఎం పోస్ట్ మంజూరు చేయించి,జీవో నెంబర్ 12 సవరించి, బీఈడీ అర్హతలు ఉన్నటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులకు పదోన్నతులకు అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని, అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యుత్ బిల్లులు ప్రభుత్వం కట్టే విధంగా మరియు సర్వీస్ పర్సన్స్ నియమించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు, సంఘం పటిష్టంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని కాబట్టి సంఘ సభ్యత్వాన్ని అందరూ ఇవ్వవలసిందిగా కోరారు. ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి అన్ని సౌకర్యాలు కల్పించిన మరియు కల్పించుటకు నిరంతరం పాటుపడే పిఆర్టియు పఠిష్టానికి ప్రతి ఉపాధ్యాయుడు సభ్యత్వం ఇవ్వండి.సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమం చేయండి అని అన్నారు.మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంఠాత్మకూర్,కౌకొండ,నడి కూడ,రాయపర్తి,చర్లపల్లి, పులిగిల్ల,చౌటుపర్తి పాఠశాలలో సభ్యత నమోదు చేపించారు.ఈ కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గొట్టేముక్కుల శ్రీనివాస్ రెడ్డి, నన్నసాహెబ్, పరకాల మండల శాఖ అధ్యక్షులు దగ్గు తిరుపతిరావు, మాజీ అధ్యక్షులు మోడమ్ రాజేందర్ బాబు,బూర శంకర్రావు, చెరిపెల్లి ప్రేమానందం, మరియు రాష్ట్ర, జిల్లా, మండల, బాధ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *