
రోడ్డు మార్గం, నీళ్లు, విద్యుత్ సౌకర్యం
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో గల 6 శతాబ్దాల చరిత్రగల అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం గ్రామం మధ్యలో కలదు. గ్రామానికి మచ్చర్లయ గుట్టపై స్వయంభూడైన శ్రీ మచ్చగిరి స్వామి వెలసినాడు మచ్చలయ్య గుట్టకు పోవడానికి అధిక వర్షాలకు మట్టి రోడ్డు కొట్టుకపోవడం జరిగింది ఇది మూడు స్థానాల్లో తెగిపోవడం వల్ల నడవలేక పోతున్నాము ప్రతిసంవత్సరం వైశాఖ శుద్ధ పాడ్యమినాడు మే నెలలో శ్రీ మత్స్యగిరి స్వామి ఉత్సవాలు జరుగును. రోడ్డు తెగిపోయిన స్థానంలో పైపులు వేసి కల్వర్టు నిర్మించి అలాగే గుట్ట వద్దకు ఒక నీళ్ల బోర్ భక్తులు నిలవడానికి ఒక షెడ్డు నిర్మించి గుట్టవరకు కరెంటు స్తంభాలు వేయించి విద్యుత్ సదుపాయం కల్పించాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ సామల బిక్షపతి, మండల ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.