నర్సంపేట,నేటిధాత్రి :
రైస్ మిల్లులో పనిచేసే హమాలీ కార్మికుల కూలి రేట్లు పెంచాలని బిఆర్ టియు,ఏఐటీయుసి కార్మిక సంఘాల అనుబంధ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో రైస్ మిల్ యాజమాన్య యూనియన్ అధ్యక్షుడు గంధం నరేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్టియు హమాలి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ ఏఐటీయుసి జిల్లా నాయకులు గుంపెల్లి మునీశ్వర్ లు మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు రేట్లు పెరగాలని ఇట్టి ఒప్పందంలో భాగంగా ఈనెల 21తో ముగుస్తుందని అన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని పెంచే విధంగా లేబర్ అధికారులు చొరవ చూపాలని కోరారు.ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు గుండెబోయిన కొమరయ్య, గాండ్ల రాములు, బొల్లం ప్రసాద్, ఎడ్ల నాగులు,తదితరులు పాల్గొన్నారు.