
తస్లీమాకు 13రోజుల రిమాండ్
శుక్రవారం ఏసీబీ కి చిక్కిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
“నేటిధాత్రి” హైదరాబాద్
ఏసీబీ అధికారులకు చిక్కిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు *ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జి.ప్రేమలత తెలిపారు.* ఈనెల 16న వరంగల్ జిల్లాలో ఏసీబీ న్యాయస్థానాన్ని ప్రారంభించారు. *మొదటి కేసు తస్లీమా కావడం విశేషం.* ఏసీబీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా, ప్రైవేట్ ఉద్యోగి వెంకట్ ను శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు 13రోజుల రిమాండ్ విధించగా పోలీసులు వారిద్దరిని *కరీంనగర్ జైలుకు తరలించారు.*