Sub Collector Visits Indiramma Colony
ఇందిరమ్మ కాలనీలో సబ్ కలెక్టర్ పర్యటన
తాండూర్,నేటి ధాత్రి:
తాండూర్ మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సోమవారం సందర్శించారు. 2007లో పట్టాలు ఇచ్చినా.. రోడ్లు,విద్యుత్,మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నామని లబ్ధిదారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు.స్పందించిన సబ్ కలెక్టర్.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిరంగి శంకర్,సర్పంచ్ ఆకుల వెంకటేష్,తహశీల్దార్ జ్యోష్ణ, ఎంపిడివో శ్రీనివాస్,విద్యుత్ ఏఈ జాన్ ఆర్ ఐ ఏజజోద్దీన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
