‘దూర విద్యలో చదివి.. ఉన్నత ఉద్యోగానికి ఎంపిక’
కల్వకుర్తి /నేటి ధాత్రి
కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన తాళ్ల శివలీల గృహిణిగా ఉంటూ.. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చదివింది. అనంతరం కల్వకుర్తిలో బీఈడీ పూర్తి చేసింది. భర్త తాళ్ల రాజేందర్ ప్రోత్సాహంతో హైదరాబాదులో ఉంటూ.. శిక్షణ తీసుకొని ప్రిపేర్ అయింది. మూడు రోజుల క్రితం వెలుబడిన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలలో ఉద్యోగం సాధించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వరుణ్ గౌడ్ అమెరికాలో ఏం.ఎస్ చదువుతుండగా.. కూతురు పూజిత హైదరాబాదులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. గృహిణిగా ఉంటూ.. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో.. పలువురు అభినందనలు తెలిపారు.