భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం మైలారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో
విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు నాణ్యమైన విద్యాబోధన చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు జిల్లా పరిషత్ పాఠశాలను భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్య నారాయణరావుతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శాసనసభ్యులు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుదొడ్ల నిర్మాణాలు హ్యాండ్ వాష్ ప్లాట్ ఫారాలు మంచినీరు విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పన పనులను చేపట్టినట్లు తెలిపారు ఈ విద్యా సంవత్సరంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలతో పాటు అర్హతలతో పాటు శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన
ఉపాధ్యాయలున్నారని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునేలా అందరూ తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులను భవిష్యత్తులో ఎవరు ఏమవుతారని అడిగి తెలుకున్నారు అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు స్కూలు యూనిఫామ్ లను అందజేశారు
ఈ సందర్భంగా ఎంఎల్ఏ సత్యనారాయణ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని అన్నారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు జిల్లాలోని అన్ని పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దుతున్నామని అన్నారు విద్యార్థులకు యూనిఫామ్ పక్కాగా సరిపోయేందుకు ముందుస్తుగానే కొలతలు తీసుకున్నామని ఆ ప్రకారమే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించామని అన్నారు పాఠశాలల్లో సమస్యలు లేకుండా విద్యాబోధనకు అనువుగా ఆహ్లాదకరంగా తయారు చేసేందుకు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు బడిబాట కార్యక్రమంలో బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు బడి ఈడు పిల్లలెవరు బడి బయట ఉండొద్దని ప్రతి ఒక్కరిని బడుల్లో చేర్పించాలని అన్నారు బడి బాట కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని పిల్లలను గుర్తించాలని సూచించారు పాఠశాలల్లో జరుగుతున్న పనులు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని పనుల్లో నాణ్యత ఉండాలని పాఠశాలలు మన పిల్లల ఉజ్వల భవిష్యత్ ను తీర్చిదిద్దే దేవాలయాలని నాణ్యతలో రాజీ పడొద్దని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని ఎంఎల్ఏ సూచించారు
ఈ కార్యక్రమంలో జడ్పి
సిఈఓ విజయలక్ష్మి, డిఈఓ రాంకుమార్ డిఅర్డిఓ నరేష్ ఎంపిడిఓ భాస్కర్ పంచాయతీ రాజ్ ఏఈ
డిఈ లు తదితరులు పాల్గొన్నారు