కష్టపడి చదివే వారు ఎక్కడైనా రాణిస్తారు టీజీఐడిసి చైర్మన్ మహమ్మద్ తన్వీర్ సన్మానం
జహీరాబాద్. నేటి ధాత్రి:
కష్టపడి చదివే విద్యార్థులు ఎక్కడ చదివిన వారు తమ ప్రతిభను కనబరుస్తారని టీజీఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని ఆర్ ఎల్ ర్ జూనియర్ కళాశాలలో బైపిసి గ్రూప్ నందు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బిజీ సరయు 440/436 సాధించి రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించడం పట్ల ఆయన అభినందించారు
నేడు ప్రభుత్వం విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పుల కారణంగా మారుమూల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కళాశాలలో కూడా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారంటే ఇది విద్యార్థిలకు పట్టిన ప్రతిభను బట్టి గుర్తించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి సరయు రాష్ట్ర స్థయిలో ర్యాంకు సాధించడం పట్ల వారి తల్లిదండ్రులకు అభినందించి విద్యార్థినికి పూలమాల, శాలువాలతో సన్మానించీ ఇంకా ఉన్నతమైన ర్యాంకులు సాధించి జహీరాబాద్ నియోజకవర్గానికి తమ కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆశీర్వదించారు. ఈరోజు ఏ రంగంలో చూసిన గ్రామీణ స్థాయి విద్యార్థులే రాణిస్తున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పట్టుదలతో ఏ కార్యక్రమం చేయాలనుకున్న దాన్ని విజయవంతంగా చేయగలుగుతారని అన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఉత్తమమైన విద్యాబధన చేయడంతోనే రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించగలుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మాన్ కాల్ సుభాష్ గుప్తా, సీనియర్ నాయకులు రంజుల్ వైద్యనాథ్, శ్రీ కాంత్ రెడ్డి, మహమ్మద్ కుతుబుద్దీన్, మహమ్మద్ జహంగీర్ , రంగా అరుణ్ కుమార్, మహమ్మద్ తాజుద్దీన్, బిజీ సందీప్, బాల్ రెడ్డి, నిజాం తదితరులు పాల్గొన్నారు.