మందమర్రి, నేటిధాత్రి:-
విద్యార్థిని, విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం కిష్టయ్య, మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ రవికుమార్ లు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు, స్పోర్ట్స్ డే ఉత్సవాలను కళాశాల ప్రిన్సిపాల్ ఎం కిష్టయ్య అధ్యక్షతన మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి, తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్యను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు టి ఉషారాణి, కె చంద్రకళ, ఎం రామయ్య, ఆర్ రాజమల్లు, కె జగన్మోహన్, ఎస్ మహేష్, ఈ ప్రభాకర్, బి ప్రదీప్, ఎం కోటేశ్వర్, వి శ్రీకాంత్, ఎండి వజీర్, సిహెచ్ బానేష్, కె నరసింహ, సిహెచ్ సతీష్, ఏ అనిత తదితరులు పాల్గొన్నారు.