బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పీజీ సెంటర్లో మూడవ విడత సీట్ల కేటాయింపు.ఎంఏ.పొలిటికల్ సైన్స్, ఎంఏ.ఇంగ్లీష్, ఎం.కామ్ కోర్సుల్లో పలువురు విద్యార్థులకు అవకాశం ఒరిజినల్ టిసి మరియు ఇతర విద్యార్హతల పత్రాలతో హాజరుకావాలి ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, పీజీ సెంటర్ ఇన్చార్జి మేడ తిరుపతి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే కాకతీయ యూనివర్సిటీ పీజీ రెగ్యులర్ కోర్సుల కోసం మూడవ విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో 800 రూపాయల అక్నాలెడ్జ్మెంట్ పేమెంట్ ఫీజు చెల్లించి ఈ నెల 12వ తేదీలోగా కళాశాలలో రిపోర్టు చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, పీజీ సెంటర్ ఇన్చార్జి మేడ తిరుపతి తెలిపారు. ఇక్కడ ఎంఏ పొలిటికల్ సైన్స్ తో పాటు ఎంఏ ఇంగ్లీష్, ఎం.కామ్ కోర్సుల్లో మూడవ విడతలో విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీరు ఈనెల 12వ తేదీలోగా తమ యొక్క సీపీగెట్ ర్యాంకు కార్డులు, సీట్ అలాట్మెంట్ లెటర్, అక్నాలెడ్జ్మెంట్ పేమెంట్ ఫీజు రిసిప్ట్ మరియు ఒరిజినల్ టి సి ఇతర ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఈ ఫోన్ నెంబర్లో 9959269975 సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ కోరారు.