వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో
ఇందిరా కాలనీ ఐదో వార్డు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, నీళ్ల సౌకర్యం లేక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులు దాహం తీర్చుకోవడానికి వారు తిన్న ప్లేట్ కడగడానికి నీళ్లు లేక వీధిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లి వారి యొక్క దాహం తీర్చుకొని, విద్యార్థులు తిన్నటువంటి ప్లేట్లను శుభ్రపరచుకొనే దుస్థితి ఏర్పడింది.
అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని ఇందిరా కాలనీలో ఉన్న ఎంపీపీ ఎస్ పాఠశాల విద్యార్థులకు నీటి వసతి ఏర్పాటు చేసే విధంగా
చర్యలు తీసుకోగలరని
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వారు తెలిపారు