నర్సంపేట,నేటిధాత్రి :
బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బిట్స్ స్కూల్, అక్షర స్కూల్ ప్రి ప్రైమరి విద్యార్థులు సోమవారం ఫీల్డ్ ట్రిప్లో భాగంగా నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్ లో గల కూరగాయల
మార్కెట్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా మార్కెట్లో విక్రయిస్తున్న పలు రకాల కూరగాయలను చూస్తు వాటి వల్ల
కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ మాట్లాడుతూ
విద్యార్థులు తమ జీవన విధాన భోజనంలో తప్పని సరిగా కూరగాయలు ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి రోజు కూరగాయలు తినడం ఎంతో ప్రయోజకరమని తెలిపారు.దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూరగాయలు ఎంతగానో
ఉపయోగపడుతాయన్నారు. కూరగాయలలో ఫైబర్ అధికంగా, కేలరిలు చాలా తక్కువగా
ఉంటాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల కూరగాయలను క్షుణ్ణంగా పరిశీలించి
వాటి గురించి తెలుసుకోవడంతో పాటు మార్కెట్ లో కూరగాయలు విక్రయిస్తున్న తీరు,ప్రతి ఒక్క కూరగాయల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు గౌతమ్ ఆర్య గౌడ్ పాల్గొన్నారు.