చందుర్తి, నేటిధాత్రి
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇట్టి సందర్భాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి విద్యార్థులు అయోధ్య అను ఇంగ్లీష్ అక్షరాలతో కూర్చొని అభిమానం చాటారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు కృష్ణ, శ్రీలత, నవీన, మంజుల అంగన్వాడి చిన్నారులు పాఠశాల విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.