
ఇంటర్ విద్య జిల్లా ప్రత్యేకఅధికారి టి.యాదగిరి
కళాశాలలో స్టడీఅవర్స్ నిర్వహించాలని సూచన
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 90 రోజుల ప్రత్యేక ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఇంటర్ విద్యాజిల్లా ప్రత్యేక అధికారి టి.యాదగిరి గౌడ్ అన్నారు.మంగళవారం పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి ఏ.గోపాల్ తో కలిసి ఆయన సందర్శించారు.అనంతరం కళాశాలతరగతిగదులు,ల్యాబరేటరీల ను సందర్శించి కళాశాలలో ఫలితాలు పెంచుటకు అధ్యాపకులు,విద్యార్థులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేయడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య చేపట్టిన చర్యలను విద్యార్థులు, అధ్యాపకులు పక్కాగా పాటించి ఈ విద్యాసంవత్సరం విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు.రాబోయేవార్షిక పరీక్షలను దృష్టిలోపెట్టుకొని ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని,కళాశాలలో నిర్వహించే స్టడీ అవర్ లను విద్యార్థులందరూ వినియోగించుకొని,తమసందేహాలను నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కళాశాలకు హాజరుకాని లేదాతక్కువ శాతం హాజరు ఉన్న విద్యార్థులను,మొబైల సహాయంతో వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని కళాశాలకు రప్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.అదేవిధంగా చదువులో వెనకబడ్డ విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులు తీసుకోవడంతోపాటు కళాశాలలో స్టడీ అవర్స్ నిర్వహించాలని ప్రిన్సిపాల్ అధ్యాపకులకు సూచించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.సంపత్ కుమార్,అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.