
తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సైతం రాణించాలని తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ పోటీలలో కరాటే విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం సాధించడంతో రామకృష్ణాపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల విభాగం లో తవక్కల్ పాఠశాల విద్యార్థులు నంది అవార్డులు సాధించడంతో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.