
Students Urged to Excel in Sports and Education
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి మన జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తేవాలని శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శనివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ సార్ విగ్రహం నుండి అంబేడ్కర్ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన క్రీడా దినోత్సవ రన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి జెండా ఊపి క్రీడా రన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడా యూనివర్సిటీతో పాటు జిల్లా కేంద్రాలలో క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తూ క్రీడలకు ప్రాధాన్యత నిస్తుందని అన్నారు.
ఎంప్రభుత్వం విద్యాతో పాటు సమాంతరంగా క్రీడలకు అత్యున్త ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశ్యంతో అన్ని జిల్లా కేంద్రాలలో క్రీడా మైదానాల ఏర్పాటు మొదలు పెట్టడం జరిగిందని యువత మత్తు పదార్థాలకు ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మీ, జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు, అధికారులు, అనధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.