
చందుర్తి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బోజ్జరపు శంకర్
హై స్కూల్ విద్యార్థులకు క్రికెట్ క్రీడా సామాగ్రిని అందజేసిన ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రము లోని హై స్కూల్ విద్యార్థులకు ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ క్రికెట్ క్రీడా సామాగ్రిని హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బొజ్జరాపు శంకర్ చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ చేతుల మీదుగా విద్యార్థులకు క్రికెట్ క్రీడా సామాగ్రిని మంగళవారం స్కూల్ ఆవరణంలో అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. విద్యార్థులు సెల్ ఫోన్ లకు దూరంగా ఉంటూ చదువుతోపాటు క్రీడలపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు… విద్యార్థులకు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు…. భవిష్యత్తులో విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు పులి నారాయణ మేడిశెట్టి మధు నక్క యాకోబు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.