శనిగరపు భద్రయ్య
అసిస్టెంట్ సెక్రటరీ
జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి
జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు పరీక్షించడం కోసం 19నవంబర్ 2024 నాడు నేషనల్ అచీవ్మెంట్ సర్వే(జాతీయ సాధన పరీక్ష) నిర్వహించు చున్నారని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు జయశంకర్ భూపాలపల్లి అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య తెలిపారు
ఈసాధన పరీక్షలు మన జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం, పిల్లల యొక్క అభ్యసించిన సామర్థ్యాలు మెరుగుపరచడం కోసం రాష్ట్ర వ్యాప్తంగాఎస్సి ఈ ఇ ఆర్ టి తెలంగాణ మూడు ప్రాక్టీస్ పేపర్లను సిద్ధం చేయడం జరిగింది. ఆ మూడు ప్రాక్టీస్ పేపర్లలో ఈరోజు మొదటి ప్రాక్టీస్ పేపర్ ను మూడవ తరగతి, ఆరవ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్ష అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను దిద్ది విద్యార్థులు ఎక్కడెక్కడ తప్పులు చేశారో వాటిని వారికి తెలియజేసి ఆయా విషయంలో విద్యార్థుల అభ్యసనా మెరుగుకు ఉపాధ్యాయులు పాటుపడాలనీ శనిగరపు భద్రయ్య కోరారు
కస్తూర్బా గాంధీ చిట్యాల జిల్లా పరిషత్ హై స్కూల్ చిట్యాల ప్రాథమిక పాఠశాల చిట్యాల పరీక్ష కేంద్రాలను సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు
వీరితో హై స్కూల్ ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు రఘుపతి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ నరేష్ ఫిజికల్ డైరెక్టర్ సాంబమూర్తి కస్తూర్బా గాంధీ సిబ్బంది పాల్గొన్నారు