# విద్యార్థులు విద్యతోపాటు సమాజంపై అవగాహన పెంచుకోవాలి
# గిరిజన ప్రాంతంలో ఉన్నా సమస్యలను పరిష్కరిస్తాం
# కొత్త పోడు కొట్టడం మానేసి ప్రతి ఒక్కరూ భాధ్యత గా మొక్కలను పెంచాలి
# త్వరలో పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది
# రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో 135.00 లక్షల రూపాయల సమగ్ర శిక్ష నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు వసతి భవనాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు సదుపాయాలు కల్పిస్తున్నామని పదవ తరగతి నుంచి కస్తూర్బా గాంధీ పాఠశాలలను అప్ గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చదువు ఒక్కటే మార్గమని విద్యార్దులకు సూచించారు ప్రతి టీచర్ ఒక విద్యార్థి అని నూతన పరిజ్ఞాన అంశాలను నేర్చునికొని విద్యార్దులకు బోధించాలని టీచర్ ప్రవర్తన విద్యార్థుల పై ఉంటుంది కాబట్టి టీచర్లు విద్యార్దులకు ఆదర్శప్రాయంగా నిలవాలని సూచించారు. విద్యార్దులను అనుమతి లేకుండా బయటికి పంపకూడదని విద్యాలయ అధికారులను ఆదేశించారు.
గ్రౌండ్ లేవలింగ్ బోర్స్ సమస్యలను త్వరలోనే త్వరలోనే పురస్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి , జి సి డి వో రమాదేవి గోవిందరావుపేట తహసిల్దార్ సృజన్ కుమార్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఎస్ఓ వెంకటలక్ష్మి మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు
తాడ్వాయి మండలం లింగాల గ్రామం లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామంలో మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల పి.శ్రీజ లతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లింగాల లవ్వల బందాల కొడిశాల గ్రామాలకు చెందిన ప్రజల నుంచి పోడు భూములు పట్టాలు జీసీసీ డిపో ఏర్పాటు రోడ్స్, కరెంట్ బస్సు రవాణా వంతు సమస్యల పై దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని వికలాంగులకు సదరం క్యాప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మహిళలకు మీసేవ కేంద్రాల ఏర్పాటు మహిళ్ల శక్తి క్యాంటీన్ ల ఏర్పాటు పై అవగనాకల్పించి వారికి ప్రోత్సాహం అందిస్తామని మహిళలు ముందుకు రావాలని కోరారు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీ స్త్రీలకు బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని అంగన్వాడీ టీచర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి , తాడ్వాయి మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అప్పయ్య, తాసిల్దార్ రవీందర్ , విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారులు, తదితరులు పాల్గొన్నారు