
పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్ నాథ్ రెడ్డి
పలమనేరు(నేటి ధాత్రి) జనవరి 04:
దుర అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు. స్థానిక టీకేసి జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు సత్పవర్తనతో రాణించి పుట్టిన గడ్డకు చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.సాంకేతిక విద్యతో మంచి భవిష్యత్తు ఉంటుందని కాబట్టి విద్యార్థులు టెక్నికల్ కోర్సులపై దృష్టి సారించాలన్నారు. సుదూర ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకాన్ని కళాశాలలోను ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని కోరారు. అంతకు ముందు కళాశాల యాజమాన్యం ఆయన ఘన స్వాగతం తెలియజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ, ఎంఈవో లీలారాణి, కళాశాల ప్రిన్సిపాల్ కన్నయ్య శెట్టి, అధ్యాపకులు శ్రీనివాసులు, సుధా రాణి, బిఎల్ ప్రసాద్ లతో పాటు టీడీపీ నాయకులు ఆర్.బీ.సి కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు,
మదన్, శ్రీధర్, కిరణ్, బీ.ఆర్.సి కుమార్, మురళీ, భాస్కర్, సుబ్బు, శీను, హరీష్ తదితరులు ఉన్నారు…