కమలాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు…
నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) మండల కేంద్రంలోని విశ్వభారతి పాఠశాలలో శనివారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మరియు మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. వీడ్కోలు సమావేశానికి కమలాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు, మండల విద్యాధికారి రామ్ కిషన్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని,ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అనంతరం పాఠశాల యాజమాన్యం పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను మరియు మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పాఠశాల కరస్పాండెంట్ మధుబాబు, ప్రిన్సిపాల్ రాజకుమార్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.