
చిట్యాల, నేటి ధాత్రి :
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది, చిట్యాల చౌరస్తా నుండి బస్టాండ్ వరకు వరకు ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు మన జన్మ హక్కు అని ఓటే వజ్రాయుధమని ప్రజాస్వామ్య రాజ్యంలో ఓటు హక్కు ఎంతో ప్రావీణ్యత ఉందని కావున 18 సంవత్సరాల నుండి నా ప్రతి ఒక్కరు ఓటు హక్కుగా నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామయ్య, స్థానిక సర్పంచి పూర్ణచందర్రావు ఎంపిటిసి పద్మా నరేందర్, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, అంగన్వాడి కార్యకర్తలు ఐకెపి వివో ఏలు తదితరులు పాల్గొన్నారు.