> గట్టు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి..
> తల్లిదండ్రుల ఆందోళన.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి

గట్టు మండలం టీ ఎస్ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్.. విద్యార్థులు దసరా పండుగ సెలవుల్లో భాగంగా విద్యార్థిని తల్లిదండ్రులు వారి పిల్లలను వారి స్వగ్రామాలకు తీసుకువెల్లగా దసరా సెలవులు అయిపోయిన సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం తిరిగి గట్టు మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించడానికి వచ్చిన సమయంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాణి,విద్యార్థులను తల్లిదండ్రులను పాఠశాలలోకి అనుమతి ఇవ్వకుండా గేట్ బయటనే ఉంచడం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.ఒక్కరోజు ఆలస్యం అవ్వడంతోనే మా పిల్లలను మమ్మల్ని ఇలా గేటు బయట తప్పుచేసిన వారిలా గేట్ బయట పెట్టిందని,కనీసం దగ్గరికి వెళ్లి అడుగుదామన్నాకాని ఎవ్వరిని లోపలకి రానివ్వకుండా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు లోపలికి రానివ్వకుండా,కనీసం మా పిల్లలకు మాకు దాహం వేస్తుందని అడుగుతున్నాకాని కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా గేటు బయట నిలపెట్టడం సరియైనది కాదని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
ఇలాంటి పరిస్థితులు ఇలా ఇదొక్కసారే కాదు,సెలవులు ఇచ్చిన ప్రతిసారి ఒక్కరోజు ఆలస్యం అయితే ఇలా ప్రతిసారి గేట్ బయట నిలబెడుతుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గట్టిగా అడిగితే మీ పిల్లల టీసి ఇచ్చి పంపుతానని బెదిరింపులకు గురి చేస్తూ న్నారని మీడియాతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కోసారి విద్యార్థిని తల్లిదండ్రులు వారి పిల్లలకు పెట్టె ఆహారం కానీ,బాత్ రూమ్ లో ఉండాల్సిన సదుపాయాల గురించి ప్రిన్సిపాల్ మేడం అడిగిన సమయంలో మీ పిల్లలను తీసుకెళ్లి మీ కిష్టమైన పాఠశాలలో చేర్పించుకొండని ఘాటుగానే సమాధనమిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో వివరించారు.
విద్యార్థిని తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర గురుకుల కార్యదర్శి అలాగే జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఈ సంఘటన పట్ల వెంటనే స్పందించి ప్రిన్సిపాల్ మేడంను సస్పెండ్ చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై పత్రిక న్యూస్ రిపోర్టర్ తిరుమలేష్,గురుకుల ప్రిన్సిపాల్ మేడం ను ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఫోన్ కట్ చేయడం,మళ్ళీ రెండు సార్లు ఫోన్ చేసిన కానీ ఎత్తకపోవడం ప్రిన్సిపాల్ మేడం విధులపట్ల ఎంత అలసత్వం వహిస్తుందో ఇట్టే తెలుస్తుంది. మాపై కఠినత్వం చూపిన ప్రిన్సిపల్ మేడం పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు..
