డయాబెటిస్ పై ప్రజల్లో అవగాహన శిభిరం నిర్వహించిన వాగ్దేవి ఫార్మసీ కాలేజీ విద్యార్థులు

నేటిధాత్రి, వరంగల్

హనుమకొండ నగరంలోని వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రాంనగర్, హనుమకొండ ఫార్మా డీ విద్యార్థులు, అధ్యాపకులు హెచ్.ఓ.డి డాక్టర్ బి.ఎస్ శరవణభవ, ఫార్మాకాలజీ హెచ్.ఓ.డి డాక్టర్ ఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 4వ నేషనల్ ఫార్మకోవిజిలెన్స్ వీక్ సెలబ్రేషన్స్ థీమ్ లో బాగంగా, బిల్డింగ్ ఏడీఆర్ రిపోర్టింగ్ కల్చర్ ఫర్ పేషంట్ సేఫ్టీ, ఈ నెల 17 నుండి 23 వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు బుధవారం నాడు నష్కల్ గ్రామం, స్టేషన్ ఘనపురం మండలం నందు డయాబెటిస్, హైపర్ టెన్షన్ లో బ్యాక్ పెయిన్, హిప్ పెయిన్ మరియు ఏడిఆర్ రిపోర్టింగ్ అనే అంశాలపై, గ్రామ ప్రజలకు అవగాహన, పేషంట్ కౌన్సిలింగ్ శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ గ్లూకోస్ మానిటరింగ్, బిపి మానిటరింగ్ లో బ్యాక్ పెయిన్ హిప్ పెయిన్ ఎక్సర్సైజులు వీటికి సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ వ్యాధులకు తీసుకోవలసిన తగు జాగ్రత్తలు మరియు మందులు పడనిచో వాటి దుష్ప్రభావాలను రిపోర్టింగ్ చేయడం హాస్పిటల్ కి వెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమాలు సమర్థవంతంగా, సులభంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో నిర్వహించినందుకు ప్రజల మన్ననలను పొందారు. ఇందుకుగాను గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ఎస్ శరవణభవ హెచ్ఓడి ఫార్మా డీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఈ వెంకటేశ్వర్లు హెచ్ఓడి ఫార్మకాలజీ, డాక్టర్ పి గిరిజ, డాక్టర్ వి స్నేహప్రియ, డాక్టర్ జి లావణ్య, డాక్టర్ టి శ్రీవర్ష, డాక్టర్ సఫియా నసీర్, డాక్టర్ ఏ మకరంద్, ఫార్మాడి 6వ సంవత్సరం ఇంటర్నిషిప్, 5వ సంవత్సరం క్లర్క్స్షిప్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు గాను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చల్లా శ్రీనివాసరెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్.వాహినీ దేవి, వాగ్దేవి కళాశాలల సెక్రటరీ కం కరస్పాండెంట్ డాక్టర్ సి.హెచ్. దేవేందర్ రెడ్డి ఫార్మాడి హెచ్.ఓ.డి. శరవణభవను అభినందించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *