గంగాధర నేటిధాత్రి :
జాతీయస్థాయి రంగోత్సవ్ డ్రాయింగ్ కలరింగ్ పోటీలలో మండలంలోని మధుర నగర్ చౌరస్తాలో గల సురభి కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు పాఠశాల కరస్పాండెంట్ వీరేశం తెలిపారు. బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రాయింగ్ కలరింగ్ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ను విద్యార్థులకు కరస్పాండెంట్ వీరేశం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయి కలరింగ్ పోటీలలో దాదాపు 109 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 24 మంది విద్యార్థులు వివిధ కలరింగ్ లలో ప్రతిభను చూపినందుకుగాను వారందరికీ ప్రశంస పత్రాలతో పాటు మెడల్స్ ను అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వీర నర్సయ్య, కలరింగ్ నిర్వాహకులు కె రామానుజాచారి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.