రామడుగు, నేటిధాత్రి:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటేషన్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. కరీంనగర్ పట్టణంలోని ఓఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పోటీల్లో జూనియర్స్ లెవల్1లో రాచమల్ల నవనీత ఉమ్మడి జిల్లా టాపర్ గా నిలవగా స్టార్ జూనియర్ కన్సోలేషన్ విభాగంలో సిరిపురం సాయిచరణ్, మేకల భవిష్య, సీనియర్స్ విభాగంలో రేగూరి మనస్వి, బైరగోని సుహాని, పెద్ది సిరి బహుమతులు సాధించారు. బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రశంసపత్రం, మెమొంటోలతో సత్కరించారు. ఈసందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గెలుపోందిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పుల శ్రీనివాస్, కోకరస్పాండెంట్ ఉప్పుల సత్యం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.