విజ్ఞాన విహార యాత్ర వల్ల విద్యార్థుల్లో అనేక విషయాల పట్ల అవగాహన కలుగుతుంది,ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి!!!
ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి
విజ్ఞాన విహారయాత్రలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గుల్లకోట విద్యార్థులు రామోజీ ఫిలిం సిటీని సందర్శించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ప్రపంచంలోని ప్రఖ్యాతి గాంచిన ప్రఖ్యాతమైన రామోజీ ఫిలిం సిటీని విద్యార్థులకు చూపించి సినిమాల నిర్మాణం అందమైన పార్కులు చూడముచ్చటైన లోకేషన్స్ ప్రపంచంలోని అన్ని విభాగాలను ఒక చోట చేరిస్తే ఎలా ఉంటుందో రామోజీ ఫిలిం సిటీని సందర్శిస్తే అలా ఉంటుందని విద్యార్థులకు ఆనందంతో పాటు ప్రపంచంలోని అనేకమైన విషయాల పట్ల ఆసక్తిని కలిగించడం ఆనందం కలిగించే నిమిత్తం విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాల యాజమాన్య కమిటీ కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు .ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గొల్లపల్లి శిరీష, ఉపాధ్యాయులు ఎస్ రమాదేవి, ఎం శ్రీనివాస్, ఎన్ నరేష్ కుమార్ ,బి శ్రీలత ,కే కృష్ణారెడ్డి ,తదితరులు పాల్గొన్నారు,