మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్లకేంద్రంలోని స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లోని కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు సందర్శించారు. వీరికి కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య స్వాగతం పలికారు. అనంతరం గార్డెన్ లోని వివిధ విభాగాలను సదాశివయ్య తిప్పి చూపించారు. గార్డెన్ లో పెంచుతున్న ఔషధ మొక్కల పనితీరును, వాటిని ఉపయోగించే పద్ధతులను సదాశివయ్య విద్యార్థుల కు వివరించారు. అంతరించిపోతున్న మొక్కలు, అలంకరణ మొక్కలు అదేవిధంగా హెర్బల్ లిప్ స్టిక్ మొక్క, జీలుగ చెట్ల ప్రాముఖ్యత ను వివరించారు. గార్డెన్ లోని కొత్తకేశవులు నెట్ హౌస్, బయోడైవర్సిటీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న పరిశోధనలు వివరించారు. విద్యార్థుల కు పాముల సంరక్షణపద్దతి ని గురించి అవగాహన కలగజేశారు. అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ, డా. సదాశివయ్య, పరిశోధక విద్యార్థిని రమాదేవి, కృష్ణవేణి డిగ్రీ కళాశాల అధ్యాపకులు చంద్రమౌళి, రామకృష్ణ, మహేష్ పాల్గొన్నారు.