ఐదు నవోదయ సీట్లుసాధించిన బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుగా నవోదయ కోచింగ్ సెంటర్లలో చదివించుకుంటారు.కానీ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ఇచ్చే కోచింగ్ ద్వారా ప్రతి సంవత్సరం నవోదయలో సీట్లు సాధిస్తున్నారని, అందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో నవోదయలో సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులు వి.నిఖిత, ఇ. వర్షిత్, ఎ. సంజిత్, ఎ.రేవంత్,కె. దీక్షిత్ లను వారు అభినందించారు.వీరి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులను,విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఇష్టంతో కష్టపడి పని చేయడం అలవాటు చేసుకుని, ఒక క్రమ పద్ధతిలో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ చిన్నారులను ప్రేరణగా తీసుకొని ప్రతి విద్యార్థి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, నవోదయ సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.