తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ ఎం పి యు పి ఎస్ పాఠశాలలో గత 15 రోజులుగా శిక్షణ తరగతులు నిర్వహించారని శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్థానిక సర్పంచ్ కొయ్యడ ఎల్లవ్వ నాంపల్లి ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె జనార్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి చేతిరాతతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అలాగే ప్రముఖ చేతిరాత నిపుణులు కంబోజుశ్రీనివాస్ మాట్లాడుతూ చేతిరాత శిక్షణ తరగతులతో విద్యార్థులకు మంచి నైపుణ్యం చూపించారని భవిష్యత్తులో వీరికి మంచి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయ బృందానికి నిపుణులకు ఉపాధ్యాయులకు సర్పంచి పాలకవర్గం ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సన్మానించారుఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయులు శ్రీనివాస్ వేణుగోపాల్ రెడ్డి మధు మల్లయ్య ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు