Iris Florets Students Shine in National Karate Championship
కరాటేలో ఐరిస్ ఫ్లోరెట్స్ ది హ్యాపీ ప్లే స్కూల్, తూముకుంట విద్యార్థులు ప్రతిభ
* విద్యార్థులను అభినంధించిన ఐరిస్ ఫ్లోరెట్స్ డైరెక్టర్ బిజెపి సీనియర్ నాయకుడు రవీందర్, ప్రిన్సిపల్ అపర్ణ
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 17 :
విద్యార్థులకు చదువుతో పాటు ఆత్మ రక్షణ శిక్షణ అవసరమనని ఐరిస్ ఫ్లోరెట్స్ డైరెక్టర్ రవీందర్, ప్రిన్సిపల్ అపర్ణ అన్నారు. ఈ పోటీలు స్కైలైన్ షోటోకాన్ స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న ఆదివారం నిర్వహించిన 5వ అంతర్జాతీయ హుయాన్ చుంగ్ ఇండియా – జాతీయ స్థాయి కుంగ్-ఫూ & కరాటే ఓపెన్ చాంపియన్షిప్ 2025–26లో తుంకుంట లోని ఐరిస్ ఫ్లోరెట్స్ ది హ్యాపీ ప్లే స్కూల్ విద్యార్థులు కరాటే పోటీల్లో విశేష విజయాలు సాధించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనతో అందరి ప్రశంసలు పొందారన్నారు. విద్యార్థుల క్రమశిక్షణ, అంకితభావం, కఠిన శ్రమ ఈ విజయానికి కారణమయ్యాయి. పతకాలు సాధించిన శ్రీవల్లి – (బంగారు), మాన్విత్ – (వెండి), సుమిత్ర – (వెండి), చార్విక్ – (వెండి), జశ్వంత్ –( కాంస్య), రోహిత్ – (కాంస్య), రితిక్– (కాంస్య) పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం లో కోచ్ ఏ. హరిప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
