
Chairman G. Kavitha Devi organized
బూచినెల్లి మైనారిటీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో బూచినెల్లి మైనారిటీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి. కవిత దేవి నిర్వహించి విద్యార్థులకు సాధారణ అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధినులు చక్కగా చదువుకోవాలని, చదువుతోపాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, సైబర్ క్రైమ్స్, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులందరూ చట్టాలను గౌరవిస్తూ, అవసరమైతే తోటివారికి తెలియజెప్పాలని సూచించారు. మీ చుట్టు బాల్య వివాహా బాధితులు, బాల కార్మికులు ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే స్థానిక తహసీల్దార్ లేదా స్థానిక పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలని కోరారు,