Youth Against Drugs
డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు, యువత కీలకం
గుండాల సిఐ లోడిగ రవీందర్
గుండాల,నేటిదాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు మంగళవారం
నషా ముక్తా భారత్ అభియాన్ ఐదేళ్ల పూర్తి సందర్భంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా గుండాల ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల నందు సామూహిక ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా సిఐ లోడిగ రవీందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి, ముఖ్యంగా ప్రతి పోలీసు, యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఈ అలవాటు వ్యసనంగా మరి వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు కుటుంబం, సమాజం మొత్తాన్ని దెబ్బతీస్తుందని యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. పోలీస్ విభాగం మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందని తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిలో అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆన్నారు. ప్రస్తుతం ప్రతి పోలీసు, యువత సైబర్ వారియర్‌గా పనిచేస్తున్నారు అని ఇకనుండి యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు ప్రజలంతా పాటుపడాలని కోరారు.
మాదకద్రవ్యాల నివారణలో పోలీసు ప్రజా భాగస్వామ్యం కీలకమని సి ఐ రవీందర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కాలేజ్ ప్రిన్సిపాల్ నారాయణ నాయక్,వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.
