ఎస్ఎస్సి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థినిలకు సన్మానం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థినిలు టాపర్లుగా నిలవడంతో అధికారులు వారికి గురువారం ఘనంగా సన్మానం చేశారు.2024 – 2025 పదో తరగతి విద్యా సంవత్సరం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో జెడ్పి హైస్కూల్ లో చదువుతున్న ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థిని సముద్రాల నక్షత్ర 600 మార్కులకు 523 మార్కులు సాధించి మొదటి టాపర్ గా నిలవడంతో 600 మార్కులకు 495 మార్కులు సాధించిన దేవిక రెండవ టాపర్ గా నిలిచినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని,అలాగే ప్రభుత్వ పాఠశాలలో అత్యంత విద్య లభిస్తుందని హాస్టల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులకు పోషకమైన ఆహారంతో పాటు నాణ్యమైన విద్య లభిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాపూరావు,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సునీత,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుధా లక్ష్మి,విద్యార్థినిల తల్లిదండ్రులు,స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.