# మద్దతు ప్రకటించిన నర్సింగ్ విద్యార్థులు
నర్సంపేట,నేటిధాత్రి :
త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోరుతూ
వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం లో ఉన్నతమైన మెడికల్ విద్యా కోసం విద్యా హబ్ గా మార్చుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తెచ్చినందుకుగాను ఆయన గెలుపు కోసం నర్సింగ్ విద్యార్థుల అధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రచారాన్ని చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల మహిళా ప్రతినిధులు కావ్య శ్రీ, లక్ష్మీ, రమ్య, ప్రణీత, రజిత, లావణ్య, భాగ్యశ్రీ, సుజాత, కావ్య, రమ, అనిత, మాధురి, రమ్య, శిరీష, రజిత, ప్రవళిక, శ్రీవర్ష, ప్రణాళిక తదితరులు పాల్గొన్నారు.