ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని తస్కియా ఫైజా ప్రతిభ.
-రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు, జిల్లాస్థాయిలో ప్రథమ ర్యాంకు
జహీరాబాద్. నేటి ధాత్రి:
పట్టణానికి చెందిన తస్కియా ఫైజా, 2024-25 ఇంటర్మీడియట్ ఫలితాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించి జహీరాబాద్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. తస్కియా ఫైజా, జహీరాబాద్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో బైపిసి గ్రూప్లో చదువుతూ, 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఆమె ఈ ర్యాంకుతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినిగా నిలిచింది. ప్రభుత్వ కళాశాలలో చదువుతూ, ఎటువంటి కోచింగ్ సెంటర్ సహాయంలేకుండా తన కష్టపడి సాధించిన ఈ విజయం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. తస్కియా ఫైజా అభినందనలు అర్షించింది. ఆమె తల్లిదండ్రులు, అధ్యాపకులు, సహ విద్యార్థులందరూ ఈ విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, జహీరాబాద్ విద్యా ప్రాంగణంలో విద్యా సంస్థల ప్రతినిధులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. “ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించగలరన్న సత్యాన్ని తస్కియా నిరూపించిందని అని వారు వ్యాఖ్యానించారు.