రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం విద్యార్థి దైవాల ప్రణీశ్ 45వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఈనెల 8నుంచి 10వ తేదీ వరకు వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో కరీంనగర్ జట్టు తరఫున పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచినట్లు స్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థి ప్రణీశ్, కోచ్ సాయికృష్ణను పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ అభినందించారు. ఈకార్యక్రమంలో స్కూల్ కోకరస్పాండెంట్ ఉప్పుల సత్యం, తదితరులు పాల్గొన్నారు.