ఎనుమాముల: నేటి ధాత్రి:
మిర్చి రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టించి పంట పండించి అమ్ముకోవడానికి మార్కెట్లోకి తీసుకువస్తే వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గించి కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేయడం సరైనది కాదని తక్షణమే ఇలాంటి పనులు మానుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈరోజు ఆయన స్థానిక ఎనుమాముల మార్కెట్ లోని మిర్చి రైతులను కలుసుకొని అనంతరం అధికారులతో మాట్లాడారు.
ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రకృతి వైపరీత్యాలతో చీడపీడలతో దిగుబడిలేక అప్పులు ఎలా చెల్లించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంటే మార్కెట్లో వ్యాపారులు మూకుమ్మడిగా ధర తగ్గించి దోచుకోవాలనుకోవడం సరైన పద్ధతి కాదని తక్షణమే ఇలాంటిచర్యలు మానుకోవాలని లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా వ్యాపారస్తులను కట్టడి చేసి మార్కెట్ అధికారులు రైతులకు న్యాయం చేయాలని కోరారు.